సూర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఈటి’ (ఎవరికీ తలవంచడు)’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల అయ్యింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ ద్వారా విడుదల చేశారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్లాప్ టాక్ నమోదయ్యింది.
అయినప్పటికీ ఈ చిత్రం డీసెంట్ అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేసింది.ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ‘ఈటి’ మూవీ మంచిగా కలెక్ట్ చేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.01 cr |
సీడెడ్ | 0.51 cr |
ఉత్తరాంధ్ర | 0.49 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.21 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.20 cr |
‘ఈటి’ చిత్రానికి తెలుగు రాష్టాల్లో రూ.3.62 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.3.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు బిజినెస్ మీద రూ.0.42 కోట్ల స్వల్ప నష్టాలు వాటిల్లాయి. ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం లిమిటెడ్ థియేటర్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేసింది.
‘పెద్దన్న’ మూవీకి నష్టపరిహారంగా ఈ మూవీని తెలుగులో విడుదల చేశారు మేకర్స్. చాలా వరకు ఆ నష్టాలను తీర్చింది అనే చెప్పాలి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?