ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద హీరోల సినిమాలకి హైప్ ఉంటే చాలు.. లెక్క వంద కోట్ల నుండి మొదలవుతుంది. ‘బాహుబలి 2’ తర్వాత ‘సాహో’ (Saaho) ‘ఆదిపురుష్’ (Adipurush) ‘దేవర’ (Devara) ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time) వంటి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు వంద కోట్ల వసూళ్లు సాధించాయి. తర్వాత టాక్ ను బట్టి కొన్ని వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి.
అయితే ఇండియాలో రూ.2000 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా దంగల్ రికార్డులు క్రియేట్ చేసింది. దాని తర్వాత ఏ సినిమా కూడా ఆ ఫీట్ ను అందుకోలేదు. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) కూడా ఆ ఫీట్ ను అందుకోలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ (Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో ‘దంగల్’ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అని అంతా భావిస్తున్నారు. అయితే ‘కంగువా’ నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) మాత్రం..
తమ సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. తమిళంలో ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు. సూర్య (Suriya) ఖాతాలో రూ.500 కోట్ల సినిమా కూడా లేదు. అలాంటిది ‘కంగువా’ (Kanguva) రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని నిర్మాత చెప్పడంతో అతనిపై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరిగింది. తాజాగా ఈ విషయంపై హీరో సూర్య స్పందించారు. నిన్న తెలుగులో ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకలో సూర్యకి ‘మీ సినిమా 2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రకటించాడు. అందుకు సూర్య.. ‘టార్గెట్ పెద్దగా పెట్టుకోవడంలో తప్పు లేదు. ‘బాహుబలి 2’ ‘కేజీఎఫ్ 2’ (K.G.F Chapter 2) వంటి సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని మేకర్స్ తీసుండరు. ప్రేమించే తీసి ఉంటారు. మేము కూడా ‘కంగువా’ ని ఎంతో ప్రేమించే తీశాం’ అంటూ చెప్పుకొచ్చారు.