‘యశోద’ సినిమా ప్రారంభిచినప్పుడు, ఆ తర్వాత షూటింగ్ మొదలైనప్పుడు, టీజర్‌లు వచ్చినప్పుడు… ఇలా ఎప్పుడూ ఈ సినిమా సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అని చెప్పలేదు. సినిమాలో సమంత ప్రధాన పాత్ర అని మాత్రం చెప్పారు. ఇందులో ఆమె యాక్షన్ సీన్స్ కూడా తీస్తున్నారు అని తెలిశాక.. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అవ్వొచ్చు అన్నారు. అయితే ట్రైలర్ వచ్చాక.. ఇది సరోగసీ అక్రమాల నేపథ్యంలోని సినిమా అని తెలిసింది. అయితే ఈ సినిమాలో ఆ అంశం ఒక్కటే చర్చించడం లేదు,
ఇంకా ఉన్నాయి అని అంటున్నారు దర్శకద్వయం హరి – హరీష్. అప్పటివరకు ‘యశోద’ చాలా చిన్న సినిమా. అలానే చేద్దాం అనుకున్నాం కూడా. అయితే ఈ కథ స్థాయి చాలా పెద్దది అనిపించింది. అదే సమయంలో సినిమాలోకి సమంత, ఇతర ప్రధాన తారగణం, సాంకేతిక బృందం యాడ్ అయ్యాక.. పరిధి మరింతగా పెరిగింది అని చెప్పారు హరి – హరీశ్. సమంత సినిమాలో చేసింది కాబట్టి.. అనడం లేదు కానీ.. అసలు ఈ కథను సమంతని దృష్టిలో పెట్టుకునే రాశామని చెబుతున్నారు.
అయితే ఆవిడ మా సినిమా చేస్తుందో లేదో అప్పటికి మాకు తెలియదు అన్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ కథ చెప్పాక అంతర్జాతీయ స్థాయిలో చెప్పాల్సిన కథ ఇది. పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అని అన్నారు. ఆ తర్వాత సమంత కూడా ఇదే మాట అన్నారు అని తెలిపారు దర్శకద్వయం. ఇక చాలామందిలాగే మాకు కూడా సమంత ఆరోగ్య పరిస్థితి పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే తెలిసింది అని చెప్పారు.
సినిమా షూటింగ్ టైమ్‌లో జ్వరం వచ్చినా ఆమె వచ్చి పాల్గొన్నారని నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు హరి – హరీష్. ‘యశోద’ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రాసిన కథ. సరోగసీ అనే అంశం మాత్రమే ఇందులో ప్రధానం కాదు. కథలో అదొక భాగం మాత్రమే. ఈ సినిమాలో దాని కంటే కీలక విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అని దర్శకులు హరి – హరీష్ చెప్పారు.
ఇక ఈ సినిమా కథ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే.. హరీష్ ఓ కథనం చదివి దీనిపై మనం ఏమైనా చేద్దామనే ఆలోచన చేశారట. అప్పుడు ఇద్దరూ కలిసి కథను సిద్ధం చేశారట. మెడికల్ మాఫియా తరహా కథగా ఈ సినిమా ఉంటుందని ఫైనల్‌గా దర్శకుల మాటల వల్ల అర్థమైంది. నిజానికి ట్రైలర్‌లోనూ అదే తెలిసింది అనుకోండి.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!