‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని వైపుల నుండి ‘సలార్’ కి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన తీరుకి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ‘బాహుబలి 2 ‘ తర్వాత ప్రభాస్ ఖాతాలో హిట్ సినిమా లేదు. ఆ లోటుని ‘సలార్’ తీరుస్తుంది అనడంలో సందేహం లేదు.
షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ..ల కాంబినేషన్లో వచ్చిన ‘డంకీ’ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ను తలదన్నేలా ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఉంటుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు కావచ్చు, చూసాక కావచ్చు, ప్రేక్షకులు ఓ విషయంలో డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందులో అంటే.. (Salaar) ‘సలార్’ టీజర్ లో హైలెట్ అయిన ‘డైనోసార్’ డైలాగ్ సినిమాలో లేదు.
‘నో కన్ఫ్యూజన్ అంటూ నటుడు టిన్ను ఆనంద్ చెప్పిన ఆ డైలాగ్ ఓ రేంజ్లో పేలింది. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆ డైలాగ్ కి ఇంప్రెస్ అయిపోయినట్టు ఇటీవల ‘సలార్’ టీంతో పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బహుశా సెకండ్ పార్ట్ లో ఉంటుందా లేక టీజర్ కోసమే ఆ గ్లింప్స్ ను షూట్ చేశారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే ‘సూరీడే’ అనే పాట కూడా సినిమాలో లేదు.
ఆ పాటకి తగ్గ సందర్భం మాత్రం ఉంది. కానీ ఎందుకో ఆ పాటను కూడా తొలగించారు. తర్వాత ఏమైనా జోడిస్తారా? లేక లైట్ తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.