మా ఫ్యామిలీలో అతి పెద్ద పండగ ఇదే.. సుస్మిత వ్యాఖ్యలు!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో త్వరలోనే ఓ బిడ్డ పుట్టబోతుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇది తమ ఫ్యామిలీ పెద్ద పండగ అని చెబుతున్నారు మెగా డాటర్ సుస్మిత. చాలా కాలంగా ఈమె తన తండ్రి నటిస్తోన్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకి కూడా ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

తమ ఇంట్లో పెద్ద పండగ రాబోతుందని.. చరణ్ తండ్రి కాబోతున్నారని చెప్పిన ఆమె.. పాప, బాబు ఇద్దరిలో ఎవరు పుట్టినా ఆనందమే అని అన్నారు. అయితే ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు అయ్యారని… కాబట్టి చరణ్ కి బాబు పుడితే బాగుంటుందనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు సుస్మిత. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు బాబీ తమకు వింటేజ్ చిరంజీవి చిరంజీవి లుక్ కావాలని చెప్పారని తెలిపారు.

నాన్నగారి సినిమాలన్నీ తమకు తెలుసని.. ఎన్నోసార్లు చూశామని.. దీంతో ఆయనకి కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదని.. తెరపై నాన్నని చూస్తుంటే ఒక పండగలా ఉందని చెప్పుకొచ్చారు సుస్మిత. ఇక ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో చిరంజీవి లుక్స్, డైలాగ్ డెలివెరీ, డాన్స్ అన్ని అంశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమాలో రవితేజ పాత్ర చాలా ముఖ్యమని మొదటి నుంచి చిత్రబృందం చెబుతూ వస్తోంది. నిజంగానే సినిమాలో రవితేజ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. సినిమాలో రవితేజ, చిరంజీవి పోటీపడి మరీ నటించారట. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus