మెగాస్టార్ 151 వ చిత్రంగా వచ్చిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం గత ఏడాది అక్టోబర్ లో విడుదలైంది. మెగాస్టార్ కు డ్రీం ప్రాజెక్ట్ ఇది. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని సుమారు 275 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మెగాస్టార్ కు హ్యాట్సాఫ్ కొట్టారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా మన చిరంజీవిగారు జీవించేసారు. రివ్యూ లు, రేటింగ్ లు చాలా అద్బుతంగా వచ్చాయి. క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే … ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
విచిత్రం ఏమిటంటే… విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చింది, రివ్యూ లు రేటింగ్ లు కూడా బాగా వచ్చాయి.. అయినా కనీసం కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని బుల్లితెర పై ప్రసారం చేసారు. సంక్రాంతికి టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి భారీ రేటింగ్ వస్తుంది అని భావించిన ఆ ఛానల్ యాజమాన్యానికి పెద్ద షాక్ తగిలింది. ‘సైరా’ చిత్రం కేవలం 11.8 టి.ఆర్.పి ని మాత్రమే నమోదు చేసింది. అదే ఈ చిత్రం తమిళ వెర్షన్ ప్రీమియర్ కు ఏకంగా 15 పైనే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. అక్కడ జనాలు థియేటర్ లో చూడలేదు కాబట్టి టీవీ ల్లో చూసి ఉంటారు.. అందులోనూ అక్కడి స్టార్ లు నయన తార, విజయ్ సేతుపతి వంటి వారు నటించిన కారణంగా అయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. తెలుగు నాట పెద్ద సినిమాలకు శాటిలైట్ రైట్స్ తీసుకోడానికి ముందు.. ముందు… ప్రముఖ ఛానెల్స్ వారు ఆసక్తి చూపుతారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. పెద్ద సినిమా అంటే.. కచ్చితంగా థియేటర్ లలోనే ప్రేక్షకులు చూసేస్తున్నారు. ఇక అటు తరువాత అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్ లలో చూసేస్తున్నారు.