మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న(నిన్న) విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రకి మెగాస్టార్ వందకు వంద శాతం న్యాయం చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్.. అద్భుతంగా వచ్చింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇక రెండో రోజు నాన్- హాలిడే అయినప్పటికీ ‘సైరా’ కు మంచి కలెక్షన్లే వచ్చాయి .
ఇక ‘సైరా నరసింహారెడ్డి’ రెండు రోజులకు గాను ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
11.14 cr
సీడెడ్
7.30 cr
ఉత్తరాంధ్ర
5.27 cr
ఈస్ట్
5.29 cr
వెస్ట్
4.36 cr
కృష్ణా
3.74 cr
గుంటూరు
5.73 cr
నెల్లూరు
2.40 cr
ఏపీ + తెలంగాణ
45.23 cr
రెస్ట్ అఫ్ ఇండియా
8.90 cr
ఓవర్సీస్
7.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
61.23 cr (షేర్)
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు కలిపి ఈ చిత్రానికి 61.23 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రానికి 139 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓవర్సీస్ లో కానీ హిందీ,తమిళ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. కన్నడంలో కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అయితే దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ కు కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.