దాదాపు 320 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన “సాహో”కి టాక్ తో సంబంధం లేకుండా పాజిటివ్ బజ్ వచ్చినా ఆఖరికి 98 కోట్ల లాస్ వచ్చింది. దాంతో సినిమాని బిగ్గెస్ట్ ఫ్లాప్ అని డిసైడ్ చేశారు ట్రేడ్ వర్గాలు. అందుకే.. “సాహో” విషయంలో జరిగిన తప్పును “సైరా”లో జరగకుండా జాగ్రత్తపడుతున్నాడు రామ్ చరణ్. సినిమాకి భీభత్సమైన క్రేజ్ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో “సైరా నరసింహా రెడ్డి” చిత్రాన్ని కేవలం 110 కోట్ల రూపాయలకే అమ్మాడు. అది కూడా చిరంజీవి మునుపటి చిత్రం “ఖైదీ నెం.150” సూపర్ హిట్ టాక్ తో 105 కోట్లు వసూలు చేసిన విషయాన్ని మైండ్ లో పెట్టుకొని.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ఓవర్సీస్ మరియు ఇతర భాషల్లోనూ రీజనబుల్ రేట్స్ కే బిజినెస్ జరిగింది. దాంతో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ అందరు మొదటివారంలోనే సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు. రామ్ చరణ్ ప్లానింగ్ వల్ల సైరా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ ఎగ్జిబిటర్స్ కి కానీ నష్టం వచ్చే అవకాశాలు లేవు. ఆ రకంగా చూసుకుంటే సైరా ఆల్రెడీ సూపర్ హిట్ కిందే లెక్క. బుధవారం విడుదల, అందులోనూ లాంగ్ వీకెండ్ కాబట్టి అయిదు రోజులపాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచినా సినిమా హిట్ కిందే లెక్క.