మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి నాలుగో తరం వారసులమంటూ కొందరు చేస్తున్న గోల నుంచి తప్పించుకోవాలనుకొన్నాడో లేక కోర్ట్ ఇష్యూస్ సినిమాకి ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకున్నాడో తెలియదు కానీ.. నిన్న సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొనే తరుణంలో “సైరా నరసింహా రెడ్డి” చిత్ర దర్శకుడైన సురేందర్ రెడ్డి చాలా సింపుల్ గా “ఈ సినిమా బయోపిక్ కాదు.. ఒక నిజజీవిత పాత్ర చుట్టూ అల్లిన కథ” అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో సెన్సార్ క్లియర్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చేసింది. అక్టోబర్ 2న సినిమా విడుదలకు కూడా పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. ముందు జాగ్రత్తతో సినిమాను “సైరా నరసింహా రెడ్డి” అని కాకుండా “సైరా” అని ప్రమోట్ చేయడం మొదలెట్టారు.
అయితే.. నిన్నటివరకూ ఇది బయోపిక్ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ టీం ఇప్పుడు ఇలా బయోపిక్ అని ఆఖరి నిమిషంలో మాట మార్చడం కూడా సరికాదు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు నచ్చితే.. ఎలాగూ బయోపిక్కా, ఫిక్షనలా అనేది పట్టించుకోకుండా ఎంకరేజ్ చేస్తారు. నిన్న విడుదలైన బాటిల్ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారు అనేది తెలియాలంటే అక్టోబర్ 2 వరకూ వెయిట్ చేయాల్సిందే.