మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్నాడు. ఇది మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి చాలా శ్రద్ధతో చిత్ర యూనిట్ సభ్యులు పనిచేస్తున్నారు. ఇక ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది.
ఇక 10 ఏళ్ళ తరువాత మెగాస్టార్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు… కనీసం వసూళ్ళు వస్తాయా అని కామెంట్ చేసినవాళ్ళకు ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం గట్టిగా సమాధానం చెప్పింది. 92 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయగా 105 కోట్ల షేర్ ను వసూల్ చేసి అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ‘సైరా’ చిత్రానికి 250 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. వారికి ఘాటుగా బదులిస్తుంది ‘సైరా’ థియేట్రికల్ బిజినెస్. ఒక్క ఆంధ్ర రీజన్లోనే 80 కోట్లు బిజినెస్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ‘బాహుబలి2’ తరువాత ఇంత ఎక్కువ బిజినెస్ జరిగిన చిత్రం ‘సైరా’ నే కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లో ‘సైరా’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా ఉన్నాయి :