ఢిల్లీ భామ తాప్సికి తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ గా అవకాశం ఇచ్చింది. ఝుమ్మంది నాదం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లో అనేక చిత్రాలు చేసింది. అయినా ఆమె మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఐరన్ లెగ్ అనే పేరు దక్కించుకుంది. దీంతో కుంగిపోకుండా బాలీవుడ్ వెళ్ళింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి పింక్ చిత్రాన్ని చేసింది. ఈ మూవీ తాప్సి కెరీర్ ని మలుపు తిప్పింది. ఘనవిజయం సాధించి మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. ఇష్టమైన రంగంలో కష్టాలు ఎదురైతే దాన్ని ఎలా అధిగమించాలో తాప్సి ఓకే ఉదాహరణగా నిలిచింది. ఈ విషయం భారతీయులకే కాదు విదేశాల్లోని ప్రముఖులకు నచ్చింది. అందుకే ఆమెకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ వారు ఆహ్వానం పలికారు.
కెరీర్ లో ఒడిడుకులు, అధిగమించిన వైనాన్ని చెప్పి తమ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని కోరింది. ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ వారు నిర్వహించే ఇండియన్ కాన్ఫరెన్స్ కి ప్రముఖులను ఆహ్వానించి వారి గురించి విద్యార్థులు తెలుసుకునేలా చేస్తుంటారు. గత ఏడాది సినీ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ఈ సారి 15 వ ఎడిషన్లో కెనెడి విశ్వవిద్యాలయంలో జరిగే ఇన్నోవేషన్లో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో తాప్సి ప్రసంగించనుంది. ఈ స్పీచ్ కోసం ప్రస్తుతం తాప్సి రెడీ అవుతోంది.