Taapsee Pannu: హీరోయిన్లు X ఫ్లైట్లు.. ఏం జరుగుతోంది అసలు.. మరి హీరోలకు..!
- October 15, 2024 / 03:52 PM ISTByFilmy Focus
హీరోయిన్లు వర్సెస్ విలన్లు చూసుంటారు.. కొన్ని సినిమాల్లో హీరోయిన్లు వర్సెస్ హీరోలు కూడా చూసి ఉంటారు. ఇది మనకు ఎన్నో ఏళ్ల నుండి అలవాటైన పరిస్థితే. అయితే ఏమైందో ఏమో గత కొంతకాలంగా హీరోయిన్లు వర్సెస్ విమానాలు అనేలా పరిస్థితి మారింది. మొన్నీమధ్య ఓ ఫ్లయిట్ విషయంలో శ్రుతి హాసన్ ఇబ్బంది పడగా.. ఇటీవల తాప్సికి (Taapsee Pannu) కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. విమాన ప్రయాణం విషయంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను తాప్సిన ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Taapsee Pannu

తాను ప్రయాణించాల్సిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి 24 గంటలు ఆలస్యమైందని.. దాని గురించి సమాచారం తెలుసుకుందామని ప్రయత్నిస్తే.. కస్టమర్ కేర్ సర్వీసు కూడా అందుబాటులో లేదని తాప్సి అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు విమానం 24 గంటలు ఆలస్యం అవ్వడం అనేది మీ సమస్య. ఎట్టిపరిస్థితుల్లోనూ అది ప్రయాణికుల సమస్య కాదు అంటూ తాప్సి తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన సర్వీసు ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం సరికాదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్ కూడా ఇలాంటి పోస్టే పెట్టింది. ఇండిగో విమానయాన సంస్థ సేవలపై అసహనం వ్యక్తం చేసింది. విమానం ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేదని మండిపడింది. తనతోపాటు ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని రాసుకొచ్చింది. అయితే ఆమెకు ఇండిగో టీమ్ నుండి ఆలస్యానికి గల కారణాలతో వివరణ వచ్చింది.

ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. హీరోయిన్లకే ఎందుకు విమానాల సమస్యలు వస్తున్నాయి. హీరోల విషయంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎందుకు రావడం లేదు. వస్తే వాళ్లు చెప్పడం లేదా? ఏమో మరి హీరోయిన్లు, విమానాల మధ్య ఆ అనుబంధం ఏంటో వాళ్లే చెప్పాలి. ఏమాటకు ఆమాట అంత ఆలస్యమైతే ఎవరికైనా కోపం వస్తుంది లెండి.












