Pushpa2: ‘పుష్ప 2’ షూటింగ్‌ అప్‌డేట్ చూపించిన అల్లు అర్జున్‌… ఏం చెప్పాడంటే?

ఓ సినిమాలో డైలాగ్‌ ట్రెండ్ అవుతుంది, మరో సినిమాలో పాట ట్రెండ్‌ అవుతుంది, ఇంకో సినిమా సిగ్నేచర్‌ స్టెప్‌ హైలైట్ అవుతుంది. మరొక సినిమాలో మేనరిజమ్‌ హైలైట్‌ అవుతుంది. అలా కాకుండా అన్నీ హైలైట్ అయ్యాయి అంటే కచ్చితంగా అది ‘పుష్ప’రాజ్‌ వల్లే అని చెప్పాలి. ‘పుష్ప’ సినిమాలో పైన చెప్పిన అన్ని హైలైట్‌లు ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘పుష్ప’రాజ్‌ 2 సిద్ధమవుతున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు అల్లు అర్జున్‌.

పాయల్‌ రాజ్‌పుత్‌ – అజయ్‌ భూపతి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దానికి అల్లు అర్జున్ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు. ఈ క్రమంలో ‘మంగళవారం’ సినిమా గురించి మాట్లాడి ముగిస్తూ ఆఖరున ‘పుష్ప: ది రూల్‌’ సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడాడు. ఇప్పుడు ఆ విషయాలే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఒకటి షూటింగ్‌ అప్‌డేట్‌ కాగా, రెండోది సినిమాలో డైలాగ్‌ స్టైల్‌.

అయితే మరో విషయం కూడా ట్రెండ్‌ అవుతోంది. అదే ప్రొడక్షన్‌ హౌస్‌ చెప్పకపోయినా బన్నీ చెప్పాడు అని. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా సాధించిన విజయం, ఆ సినిమా తెచ్చిపెట్టిన జాతీయ పురస్కారం వల్ల అల్లు అర్జున్‌కు ‘పుష్ప: ది రూల్‌’ చాలా కీలకంగా మారింది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలి అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ సినిమాకు డబుల్‌ కష్టపడుతున్నాడట బన్నీ. ఈ క్రమంలో స్టార్‌ హీరోలు తక్కువగా ముందుకొచ్చే గెటప్‌ను ఈ సినిమాలో వేశాడు. ఆ పోస్టర్‌ ఎంతటి బజ్‌ తీసుకొచ్చిందో మీకూ తెలుసు.

ఇప్పుడు ‘మంగళవారం’ ప్రచారంలో బన్నీ ఆ గెటప్‌ గురించి మాట్లాడాడు. ‘చేతికి పారాణి, వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ చూశారుగా… ఆ గెటప్‌లోనే జాతర సన్నివేశం చిత్రీకరిస్తున్నాం అని చెప్పారు. దీంతో జాతరలో వచ్చే యాక్షన్‌ సీన్లు మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంటాయి అని ఫ్యాన్స్‌ అంచనా వేసుకుంటున్నారు. అలాగే ‘పుష్ప’ సినిమా తర్వాత అందరూ తగ్గేదెలే అన్నారు. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత ‘అస్సలు తగ్గేదెలే’ అంటారు అని హైప్‌ పెంచాడు. దీంతో ‘పుష్ప’రాజ్‌ అస్సలు తగ్గేదేలే అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా (Pushpa2) వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్‌ అవుతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus