ఏపి ప్రభుత్వం సినీ పరిశ్రమని టార్గెట్ చేసి కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టికెట్ రేట్లు బాగా తగ్గించేసి పెద్ద సినిమాలకి.. పెద్ద సమస్యలనే క్రియేట్ చేసాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం అంత ఘోరంగా ప్రవర్తించదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమయ్యి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పరోక్షంగా ఏపి ప్రభుత్వానికి చురకలు కూడా అంటించారు.
ఆయన మాట్లాడుతూ.. “ఎక్కడో ఎవరో టికెట్ రేట్లు తగ్గించారని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా అలా కఠినంగా మారి టికెట్ రేట్లు తగ్గించేది లేదు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రభుత్వానికి అవగాహన ఉంది. ఒమిక్రాన్ దాడి చేస్తుందని థియేటర్లను మూయడం కూడా జరుగదు. అలాగే ఆక్యుపెన్సీని తగ్గించే సమస్య కూడా లేదు. అలాంటి ప్రచారాలను కూడా నమ్మొద్దు. కరోనా వల్ల సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
‘అఖండ’ విడుదలైన తర్వాత సినిమా కోసం థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. త్వరలోనే పుష్ప, భీమ్లా నాయక్, ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలయ్యి బ్రహ్మాండంగా రన్ అవుతాయి. ఈ క్రమంలో దర్శక-నిర్మాతలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వారందరికీ ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుంది’” అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, నవీన్ ఎర్నేని, ప్రమోద్, అభిషేక్ నామా, రాజమౌళి, త్రివిక్రమ్ మొదలగువారు పాల్గొన్నారు.
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!