Tamanna: హాట్ టాపిక్ గా మారిన తమన్నా మగరాయుడు లుక్..!

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ కు భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. తళతళలాడే అందాలు ఆరబోస్తూ ఈమె 17 ఏళ్ళుగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. అయితే సడెన్ గా ఈమె మగరాయుడు లా దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా ఎందుకు? ఎప్పుడు? ఇలా కనిపించాల్సి వచ్చింది… అనే ప్రశ్నలు ఇప్పుడు ఊపందుకున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఆ లుక్ ‘ఎఫ్3’ మూవీకి సంబంధించింది.

‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హారిక అనే పాత్రలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ‘ఎఫ్2’ కంటే కూడా ‘ఎఫ్3’ లో తమన్నా పాత్రకి స్కోప్ ఎక్కువ అనే చెప్పాలి. అంతేకాదు సెకండ్ హాఫ్ కోసం ఈమె మగాడి గెటప్ లో కనిపించాల్సి వచ్చింది. అది ఎందుకు అన్న విషయాన్ని రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి.. ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ‘ఎఫ్3’ లో మగాడి గెటప్ లోకి మారిన తర్వాత తమన్నా..

మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. అది కూడా కథలో భాగంగానే. ఆమెతో తమన్నాకి ఓ పాట కూడా ఉంటుంది.ఆ ట్రాక్ కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నా శృతి మించలేదు. అయితే తమన్నా ‘మగరాయుడు’ గెటప్ గురించి చిత్ర బృందం రిలీజ్ కు ముందు వరకు ఎక్కడా రివీల్ చేయలేదు.

ఇంకో విషయం ఏంటి అంటే తమన్నాకి ‘ఎఫ్3’ టీంకి మధ్య చిన్న గొడవ అయినట్టు కూడా వినికిడి. ప్రమోషన్స్ లో కూడా ఆమె ఎక్కువగా కనిపించింది లేదు. అందుకు కారణం.. తమన్నా ‘మగరాయుడు’ గెటప్ వల్లనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus