Tamannaah: మరో సినిమా ప్రమోషన్స్ ఎగ్గొడుతున్న తమన్నా!

మిల్కీబ్యూటీ తమన్నా తన సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటివరకు తన సినిమాలన్నింటినీ ప్రమోట్ చేసింది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘ఎఫ్3’ సినిమా విషయంలో ప్రమోషన్స్ ను లైట్ తీసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్3’ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా ఎక్కడా కనిపించలేదు. ఒకే ఒక ప్రెస్ మీట్ లో మాత్రం దర్శనమిచ్చింది. సెట్స్ లో దర్శకుడితో జరిగిన చిన్న గొడవ కారణంగానే తమన్నా ప్రమోషన్స్ కి రాలేదని సమాచారం.

షూటింగ్ సమయంలో గొడవ జరిగిందనే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అందుకే ప్రమోషన్స్ ఎగ్గొట్టేసింది తమన్నా. అయితే ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా తమన్నా ఇలానే చేస్తుందని సమాచారం. సత్యదేవ్ హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటించింది తమన్నా. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

కన్నడలో తెరకెక్కిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. 2020లోనే ‘గుర్తుందా శీతాకాలం’ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసింది. వరుస వాయిదా అనంతరం ఇప్పుడు సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టడం కోసం తమన్నాను సంప్రదించింది టీమ్.

కానీ దానికి ఆమె ఒప్పుకోవడం లేదట. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం తమన్నాకు కోటిన్నరకి పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంత మొత్తం తీసుకొని కూడా ప్రమోషన్స్ ఎగ్గొట్టే ప్లాన్ లో ఉంది తమన్నా. మరి సత్యదేవ్ ఒక్కడే ఈ సినిమాను జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయగలరో లేదో చూడాలి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus