ఇప్పటి రోజుల్లో ఓ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వస్తే అంత మంచింది. ఎక్కువ హైప్ ఏర్పడి… మంచి టాక్ రావడానికి అవి ఉపయోగపడతాయి. ఓపెనింగ్స్ బాగా వచ్చి బయ్యర్స్ సేఫ్ అవుతారు. అయితే ఈ క్రమంలో నెగిటివ్ టాక్ లేదా నెగిటివ్ పబ్లిసిటీ జరిగితే వెంటనే మీడియా సమావేశాలు… సక్సెస్ మీట్ లు.. థాంక్స్ గ్యివింగ్ మీట్ లు అంటూ పెట్టేసి ఆ నెగిటివ్ టాక్ మరియు ఆ నెగిటివ్ పబ్లిసిటీ నుండీ ప్రేక్షకుల్ని డీవియేట్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా మా సినిమా బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్ అంటూ పోస్టర్ లు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఓ దర్శకుడు మరియు రైటర్ మాత్రం వారి సినిమా మీద వారే నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుని చివరికి..
దానిని హిట్ చేసారట. ఎవరు ఆ దర్శకుడు.. రైటర్? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ..!అక్కినేని నాగేశ్వర రావు హీరోగా 1973 సెప్టెంబర్ 12 న విడుదలైన ‘అందాల రాముడు’ చిత్రం మొదటినుండీ ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. దర్శకుడు బాపు అలాగే రైటర్ ముళ్ళపూడి వెంకట రమణ.. సాగదీత ఎక్కువ అయ్యింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.ఈ క్రమంలో ‘చూసినోళ్ళు మరియు తీసినోళ్ళ అంచనాలను తలకిందులు చేసిన సినిమా. అనే కామెంట్ తో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో బోటు తిరగబడినట్టు, అందరూ కొట్టుకుపోతున్నట్టు కార్ట్యూన్ ఒకటి ఉంది. అందాల రాముడు 70వ రోజు.. అనే మరో పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఏడ?? అని ఓ ప్రేక్షకుడు అడిగినట్టు – ”ఏడా లేదు, బేడా లేదు. సినిమా రిలీజైన దగ్గర నుండీ ఇవాల్టికి 70వ రోజు” అయినా జనాలు లేరు అంటూ మరో సెటైర్ వేసినట్టు ఉంది. బయ్యర్స్ కంగారు పడ్డారు.. కానీ ఆ రోజు నుండీ జనాలు థియేటర్లకు ఎక్కువ వెళ్ళడం మొదలు పెట్టారు. సినిమా బాగానే ఉంది కదా అనే టాక్ నుండీ … సినిమా బాగుంది. ఎవరు బాలేదని చెప్పింది అంటూ సూపర్ హిట్ అయ్యేలా చేసింది ఆ నెగిటివ్ పబ్లిసిటీ. అయితే ఇప్పట్లో కష్టమేమో లెండి.