యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆంధ్రావాలా’ తర్వాత రెండో సినిమాగా వచ్చింది ‘టెంపర్’. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘ఆంధ్రావాలా’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ట్రేడ్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కేవలం ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ ఇమేజ్ పైనే ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
2015 ఫిబ్రవరి 13 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘టెంపర్’ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం
11.20 cr
సీడెడ్
6.25 cr
ఉత్తరాంధ్ర
3.55 cr
ఈస్ట్
2.20 cr
వెస్ట్
1.75 cr
గుంటూరు
3.02 cr
కృష్ణా
2.08 cr
నెల్లూరు
1.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
31.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
6.50 cr
ఓవర్సీస్
5.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
43.10 cr (షేర్)
‘టెంపర్’ (Temper) సినిమా రూ.42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.43.1 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.1 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది.