Thaman, Pawan Kalyan: ఆ పాటకు డీజే వెర్షన్ రెడీ చేస్తున్న థమన్.. కానీ?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వకీల్ సాబ్ మూవీతో సక్సెస్ సాధించడంతో పాటు హిట్టయ్యే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్ లో రీమేక్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీలో నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన లాలా భీమ్లా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా అదిరిపోయే డీజే వెర్షన్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ నెల 31వ తేదీన భీమ్లా నాయక్ డీజే వెర్షన్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాశారు. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తుండగా ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ మధ్య పోటీ ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. లాలా భీమ్లా డీజే వెర్షన్ కోసం మరో 50 రోజులు ఎదురు చూడాల్సి ఉండటంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus