Thaman: ‘సర్కారు వారి పాట’ సాంగ్ లీక్.. తమన్ ఆవేదన!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 12న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి పాటను విడుదల చేయాలనుకున్నారు.

Click Here To Watch

కానీ ఈ పాట ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. గతంలో సినిమా టీజర్ విషయంలో కూడా ఇలానే అయిందని.. ఇప్పుడు సాంగ్ లీక్ కావడంతో చిత్రయూనిట్ పై మండిపడుతున్నారు. అయితే సాంగ్ లీక్ అవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ లీక్ అవ్వడంతో తన హార్ట్ బ్రేక్ అయిందని.. చాలా బాధగా ఉందని అన్నారు.

”ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. ఈ పాట షూటింగ్‌ సమయంలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అబిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్బుతమైన లిరిక్స్‌. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్‌ వీడియో. మేం ఎంతో హ్యాపీగా వరల్డ్‌లోనే బెస్ట్‌ ప్లేస్‌, మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం.

అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్‌లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాద పడాలా.. మూవ్‌ఆన్‌ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్‌ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్‌ బ్రేక్‌ అవ్వను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదురుకున్నాను లైఫ్‌లో. చాలా బాధగా ఉంది. నేనెందుకు పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసీ అనేది ఎంత గోరమైన విషయమో వాడికి తెలియాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus