Thaman, Mahesh Babu: ఫేక్ న్యూస్ పై తమన్ ఫన్నీ కామెంట్స్..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్(బుజ్జి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ గ్లిమ్ప్స్ రిలీజ్ అవ్వడం దానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడం అందరికీ తెలిసిన విషయమే. ఈ గ్లిమ్ప్స్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాలో పాటలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ బాబు నటించిన గత రెండు సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

అతను మంచి మ్యూజిక్కే అందించినప్పటికీ.. తమన్ మంచి ఫామ్లో ఉండడంతో దేవి పాటలు వారిని సంతృప్తి పరచలేకపోయాయి. దాంతో మహేష్ నెక్స్ట్ సినిమాకి తమన్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు. ‘సర్కారు వారి పాట’ తో పాటు మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా తమనే సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అయితే ‘సర్కారు వారి పాట’ కి తమన్ మంచి ట్యూన్స్ అందించలేదని దాంతో అతన్ని తప్పించే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.

వాటిని బేస్ చేసుకునే తమన్ ని ఓ నెటిజెన్.. ‘సర్కారు వారి పాట’ నుండీ తమన్ ను తీసేసారు అంటూ ఓ ట్వీట్ వేసాడట. దానికి తమన్ రిప్లై కూడా ఇచ్చినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘నిజం ఉంటే కామ్ గా ఉండాలి లేనప్పుడు వాడికి ఇచ్చేయాలి కదా’ అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus