Thaman: జై బాలయ్య సాంగ్ విషయంలో థమన్ అలా ప్లాన్ చేశారా?

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మాలిని దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వీర సింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.ఇలా ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నటువంటి ఎస్ ఎస్ తమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా జై బాలయ్య అనే సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలియజేస్తూ త్వరలోనే తొడగొట్టే టైం వచ్చింది రోయ్ అంటూ ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇస్తూ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు. తమన్ అఖండకు గూస్ బంప్స్ తెప్పించే ట్రాక్స్ అందించారు కానీ వీర సింహారెడ్డికి అంతకుమించి ఉండేలా ఈయన ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా వీరసింహారెడ్డి సినిమా కోసం తమన్ ఇలాంటి పాటను ప్లాన్ చేసినప్పటికీ ఇలాంటి కవర్ సాంగ్స్ చేయడం కోసం భారీగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

జై బాలయ్య సాంగ్ కోసం భారీగాకవర్ సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిర్మాతలు బయటకు చెప్పకపోయినా ఈ సాంగ్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం అవసరమా అని ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తమన్ వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ అందుకోవాలని ఉద్దేశంతో సినిమా బడ్జెట్ పెంచుతున్నారని తెలుస్తోంది. అయితే ఇలా కవర్ సాంగ్ చేయడం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus