Thaman: ఫైనల్ గా ట్రాక్ లోకి వచ్చేసిన తమన్!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S.S.Thaman) ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అలరిస్తూ సినిమా మీద సినిమా సెట్ చేస్తూ అందరికీ తన టాలెంట్ ఏంటో చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా సినిమాలకు అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. అయితే మధ్యలో కొన్ని సినిమాలకు నెగటివ్ కామెంట్స్ వచ్చినా, ఆ విమర్శలకు సమాధానంగా మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game changer) , ప్రభాస్‌ (Prabhas) రాజా సాబ్ (The Rajasaab), బాలయ్య (Nandamuri Balakrishna) అఖండ-2 (Akhanda 2) సినిమాలతో పాటు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్‌పై తమన్ పని చేస్తున్నారు.

Thaman

బాలీవుడ్ లో కూడా తన ప్రతిభ చూపిస్తూ వరుణ్ ధావన్ (Varun Dhawan), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటిస్తున్న ‘బేబీ జాన్’ (తేరి రీమేక్) సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన బేబీ జాన్ టీజర్‌కి తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి నెటిజన్ల నుండి భారీ స్పందన లభించింది.

ప్రత్యేకంగా జివి ప్రకాశ్ (G. V. Prakash Kumar) కంపోజ్ చేసిన ‘తేరి’ (Theri) సినిమా మ్యూజిక్ తో పోల్చినా తమన్ బేబీ జాన్ టీజర్ లో ఇచ్చిన స్కోర్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఈ స్కోర్ పై ప్రశంసలు కురిసాయి. ఇదిలా ఉండగా, రీసెంట్ గా విడుదలైన అజయ్ దేవ్ గణ్ (Ajay Devgn) ‘సింగం ఎగైన్’ (Singham Again) చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

రవీ బస్రూర్‌తో కలిసి తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై విమర్శలు రావడంతో, ఇది ఆయనకు పెద్ద టార్చర్‌గా మారింది. అయినప్పటికీ, ‘బేబీ జాన్’ టీజర్ లో తమన్ స్కోర్ అతనికి వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని మర్చిపోయేలా చేస్తోంది. ఇప్పుడు తమన్ బేబీ జాన్ టీజర్ తో మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. రాబోయే సినిమాలతో తమన్ ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తాడో, ఎలాంటి హిట్స్ అందుకుంటాడో అన్నది ఆసక్తిగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus