ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ బాలకృష్ణ గొప్పదనం గురించి చెబుతూ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది సౌత్ హీరోలు నార్త్ హీరోల గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారని సోషల్ మీడియాలో నార్త్ సినిమాల గురించి ట్రోలింగ్ జరుగుతోందని అదే విధంగా నార్త్ ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాలను ట్రోల్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నార్త్ సినిమాలు బాగా లేకపోయినా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని తమ్మారెడ్డి వెల్లడించారు.
గతంలో జరిగిన ఒక సంఘటనను తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల క్రితం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగగా ఆ ఫిల్మ్ ఫెస్టివల్ కు బాలయ్యను పిలవాలని ఫిల్మ్ ఛాంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేశారు. బాలయ్యను ఆహ్వానించగా బాలయ్య నన్ను కూడా ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని షరతు విధించారని ఆయన తెలిపారు. బాలయ్య షరతుకు తాను అంగీకరించానని గోవాకు విమానంలో నేను, బాలయ్య వెళ్లామని అక్కడ ఒక మేనేజర్ ఇన్నోవా కారు ఇచ్చి,
బొకే ఇచ్చి పంపించారని ముఖ్య అతిథి అయిన బాలయ్యను సరైన విధంగా గౌరవించకుండా అవమానించారని తమ్మారెడ్డి తెలిపారు. నార్త్ హీరోలకు బెంజ్ కార్లను ఇస్తారని మనల్ని అవమానించారని బాలయ్యతో చెప్పగా బాలయ్య చేసిన కామెంట్లు విని తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. మనల్ని ఇక్కడికి అతిథిగా ఆహ్వానించారని గౌరవం పొందడానికి కాదని బాలయ్య చెప్పారని మనకు గుర్తింపు ఉండటం వల్లే ఇక్కడికి పిలిచారని బాలయ్య కామెంట్లు చేశారని తమ్మారెడ్డి చెప్పారు.
అభిమానులు ఇచ్చిన స్థానం ఇది అని బాలయ్య తనతో చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. సౌత్ సినిమాలు సక్సెస్ సాధించినా నార్త్ సినిమాలను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకోవాలని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. నిర్వాహకుల చేత ఖర్చు చేయించడం ఇష్టం లేక బాలయ్య సొంత డబ్బుతో రెండు కేసుల మంచినీటి బాటిల్స్ ను షాప్ కు వెళ్లి కొన్నారని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.