పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ పై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నప్పటికీ ఆ అభిమానం ఓట్లుగా రావడం లేదంటూ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలు తనకు ఓట్లు వేయడం లేదంటూ చేసిన కామెంట్స్ తనని చాలా బాధపెట్టాయని తమ్మారెడ్డి భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేయడం లేదు అని చెప్పడం సరైనది కాదని తెలిపారు. ఎందుకంటే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు అంటూ తమ్మారెడ్డి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల జనసేనకు ఎంతో మంచి బలం ఉన్న నియోజకవర్గాలే అయినప్పటికీ పవన్ గెలవలేకపోయారని తెలిపారు.
అయితే ఆయన గత ఎన్నికలలో సరైన స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు. ఆయన చేసే ప్రయత్నాలు చేయకుండా ఇలా ప్రజలపై నిందలు వేయడం సరికాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలపై మనసు పెట్టడం లేదని ఒకవేళ మనసుపెట్టి కనుక ఈయన ఎన్నికల బరిలో దిగితే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పారు.
మీ ఓట్ల శాతం ఎంతుందో అని నిజాయతీగా ధైర్యంగా చెప్పగలరు. అంతే ధైర్యంగా పోరాటం చేయాలి. అంతేకాని నాకు 40 సీట్లు వస్తే కింగ్ మేకర్ అవుతా అనే మాట పవన్ కళ్యాణ్ లాంటి వారి నోట రాకూడదు అని తమ్మారెడ్డి అన్నారు. ఇలా పవన్ రాజకీయాల గురించి తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.