‘తమ్ముడు’ మూవీలో నటించిన ‘లవ్ లీ’ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

అదితి గోవత్రికర్.. పేరు చెప్తే గుర్తు పట్టడం కష్టమే కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘తమ్ముడు’ మూవీలో ‘లవ్ లీ’ నటించిన బ్యూటీ అంటూ టక్కున గుర్తు పట్టేస్తారు.. 1999లో ఈ సినిమాతోనే యాక్ట్రెస్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రీతి జింగానియా తర్వాత.. స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ‘లవ్ లీ’ గా ఆకట్టుకుంది.. ప్రస్తుతం అదితి పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘తమ్ముడు’ సినిమా సెకండ్ హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనంటూ కామెంట్స్ చేస్తున్నారు..

చిన్న వయసులోనే మోడలింగ్ స్టార్ట్ చేసి పలు టైటిల్స్ విన్ అయిన అదితి టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో నటించింది.. సినిమాల్లోకి రాకముందే కాలేజీ రోజుల్లో ప్రేమించిన ముఫజల్ లక్డావాలాతో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. 1998లో మ్యారేజ్ చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలు.. 2009లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది.. పెళ్లి తర్వాత హిందీలోనూ సినిమాలు తగ్గించేసింది..అదితి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో..

వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్, కౌన్సిలర్, యాక్టర్, సూపర్ మోడల్, మిస్ వరల్డ్, డాక్టర్, సైకాలజిస్ట్.. ఇలా చాలానే పెట్టుకుంది తన ప్రొఫైల్‌లో..దీంతో అదితి మల్టీటాలెంటెడ్ అంటున్నారు నెటిజన్లు.. విశేషం ఏంటంటే తన రియల్ లైఫ్ (డాక్టర్) లానే 2019లో ‘స్మైల్ ప్లీజ్’ అనే మరాఠీ మూవీలో ‘డాక్టర్ అదితి’ అనే క్యారెక్టర్ చేసింది. ఈమధ్య ‘మిస్ మ్యాచ్డ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇన్‌స్టాలో 1.1 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారామెని.. తన ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుంది అదితి గోవత్రికర్..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus