అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కలయికలో ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన సినిమా ‘తండేల్’ (Thandel) . ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకుడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కాంబినేషనల్ క్రేజ్, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
Thandel Collections
6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.52.4 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.16.4 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.92.56 కోట్లు కొల్లగొట్టింది. కొద్దిలో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను మిస్ అయినట్టు స్పష్టమవుతుంది.