నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటంతో నిర్మాత దిల్ రాజు తక్కువ టికెట్ రేట్లకు థాంక్యూ సినిమా ప్రదర్శితం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నైజాంలో థాంక్యూ మూవీ టికెట్ రేట్లను ఊహించని స్థాయిలో తగ్గించారు. థాంక్యూ మూవీ టికెట్ ధర సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు+ జీఎస్టీ కాగా తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు + జీఎస్టీగా ఉంది. సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థాంక్యూ సినిమా ప్రదర్శించబడుతోంది.
ఏపీలో థాంక్యూ టికెట్ రేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాతో చైతన్య ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించగా హీరోయిన్ల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ కె కుమార్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ ప్రాజెక్ట్ తో విక్రమ్ కె కుమార్ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఇండస్ట్రీలో అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని థాంక్యూ మూవీ కూడా నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చైతన్య తర్వాత సినిమాలు వెంకట్ ప్రభు, పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అక్కినేని హీరో నాగచైతన్య మల్టీస్టారర్ సినిమాలలో, బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. దిల్ రాజు టికెట్ రేట్లను తగ్గించడంతో థాంక్యూ మూవీ కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.