Bigg Boss Telugu 6: ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచీ ఆమె ఎలిమినేట్ కాబోతోందా ?

బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయి అప్పుడే మూడు వారాలు దాటిపోయింది. ఇప్పుడు నాలుగోవారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఈసారి నామినేషన్స్ లో పదిమంది ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరిలోనూ ఉత్కంఠని కలిగిస్తోంది. వీళ్లలో డేంజర్ జోన్ లో ఈసారి ఐదుగురు ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ఒక్కసారి మనం చూసినట్లియితే, ఫస్ట్ పొజీషన్ లో రేవంత్ ఉన్నాడు. రేవంత్ కి బాగా ఓటింగ్ జరుగుతోంది.

రేవంత్ దాదాపుగా 28శాతం వరకూ ఓటింగ్ ని సంపాదించాడు. ఆ తర్వాత ఇనయ సుల్తానాకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది బాగా పెరిగింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు తనపైన సింపతీ వర్కౌట్ అయ్యింది. అందుకే తను ఓటింగ్ లో దూసుకుపోయింది. అలాగే, మూడో పొజీషన్ లో శ్రీహాన్ ఉన్నాడు. శ్రీహాన్ కూడా ఈవారం ఎలిమినేషన్ నుంచీ దాదాపుగా తప్పించుకున్నట్లే. ఇనయతో జరిగిన పిట్ట గొడవ వల్ల కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ డ్రాప్ అయినా కూడా ఈవారం సేఫ్ జోన్ లో మాత్రం ఉన్నాడనే చెప్పాలి.

తర్వాత కీర్తి ఓటింగ్ లో తన సత్తాని చాటుతోంది. నాలుగోవారం ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చిన కీర్తి భట్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూపిస్తోంది. ఈవారం ఖచ్చితంగా సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఐదో స్థానంలో గీతురాయల్ సేఫ్ జోన్ లోనే కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి వస్తున్న గీతు సేఫ్ గానే ఉంటోంది. ఇక మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. రాజశేఖర్, ఆర్జే సూర్య. అర్జున్ కళ్యాణ్ లతో పాటుగా సుదీప ఇంకా ఆరోహి వీళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి.

అయితే, ఈసారి అందరికంటే లీస్ట్ గా మాత్రం అర్జున్ కళ్యాణ్ ఇంచా సుదీప ఉన్నారు. వీళ్లిద్దరిలో ఖచ్చితంగా ఒకరు వెళ్లే ఛాన్స్ ఉంది. చాలా చోట్ల పోలింగ్ గమనిస్తే సుదీప ఎలిమినేట్ అవుతుందా అని కూడా అనిపిస్తోంది. చాలామంది కామెంట్స్ కూడా సుదీప ఎలిమినేట్ అనే పెడుతున్నారు. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఆర్జే సూర్య కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుందని అంచనా. మరి నాలుగోవారం సుదీప ఎలిమినేట్ అయిపోతే హౌస్ మేట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus