బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా ఆరుగురు పోటీపడ్డారు. ముఖ్యంగా పాము టీమ్ సభ్యులు ఈ పోటీలో అర్హతని సంపాదించారు. పాము టీమ్ లో ఉన్న శ్రీహాన్ ఈవారం కెప్టెన్సీ పోటీదారుడు కాలేడు కాబట్టి, శ్రీహాన్ ప్లేస్ లో శ్రీసత్యని ఎంచుకున్నాడు. తన ప్లేస్ ని శ్రీసత్యతో స్వాప్ చేస్కున్నాడు. అలాగే, బంగారు మణిని దక్కించుకున్న కారణంగా మెరీనా నిచ్చెనల టీమ్ లో నుంచీ కెప్టెన్సీకి అర్హతని సంపాదించింది. దీంతో ఈవారం కెప్టెన్సీ పోటీ రసవత్తరంగా మారింది.
అయితే, ప్రస్తుతం సోషల్ మీడియా మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈవారం ఫైమా కెప్టెన్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే,టాస్క్ లో గట్టి పోటీ పడిందని, రోహిత్ ఇంకా ఫైమా ఇద్దరిలో ఫైమా కెప్టెన్ అయ్యిందని చెప్తున్నారు. నిజానికి టాస్క్ లో పాముల టీమ్ కంటే కూడా నిచ్చెనల టీమ్ గేమ్ చాలా బాగా ఆఢింది. బాలాదిత్య, రేవంత్, రోహిత్, ఇనయ వీళ్లందరూ కూడ నిచ్చెనలు కట్టడంలో విజయం సాధించారు. మట్టిని ఎక్కువ సంపాదించిన రేవంత్ అందరికంటే కూడా చాలా బాగా గేమ్ ఆడాడు.
అలాగే, బాలాదిత్య కూడా మట్టిని ఎక్కువ సంపాదించి మరీ గేమ్ ఆడాడు. కానీ, నాగమణులు కాపాడుకోవడంలో మాత్రం నిచ్చెనల టీమ్ విఫలం అయ్యింది.నాగమణుల టాస్క్ లో పాముల టీమ్ సభ్యులు కావాలనే రేవంత్ ని టార్గెట్ చేశారు. దీంతో రేవంత్ రెచ్చిపోయాడు. అందరిపైన అరుస్తూ గేమ్ పై ఫోకస్ తగ్గించుకున్నాడు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని బాధపడ్డాడు. అయితే, నిచ్చెనల టీమ్ నుంచీ మెరీనా దగ్గర బంగారు మణి ఉన్న కారణంగా అందరూ మెరీనాని కెప్టెన్సీ పోటీదారులుగా అనుకున్నారు.
దీనికి శ్రీసత్య, ఇనయ, రోహిత్, బాలాదిత్య ఓట్లు వేశారు. ఇక రేవంత్ కూడా తప్పనిసరిగా గ్రూప్ డెసీషన్ కి తలవంచాడు. అయితే, ఇక్కడే మెరీనా ఇంకా ఫైమా ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది హౌస్ మేట్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈవారం కెప్టెన్ గా ఫైమా అయినట్లుగా సమాచారం. టాస్క్ లో గెలిచి ఫైమా 10 వ వారం ఇంటి కెప్టెన్ గా నిలిచింది. ఇక ఈవారం నామినేషన్స్ లో చూస్తే ఫైమా డేంజర్ జోన్ లో ఉంది. ఇంటి కెప్టెన్ అయినా కూడా ఫైమా ఈవారం సేవ్ అయితేనే వచ్చేవారం తనకి ఇమ్యూనిటీ లభిస్తుంది. అదీ మేటర్.