Dasara Movie: ‘దసరా’ టీంని టెన్షన్ పెడుతున్న విషయం అదే..!

నాని హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. మార్చి 30 న విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. చెప్పుకోవడానికి ఒక్క హిట్టు కూడా లేని బ్యానర్ ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ చిత్రంతో హిట్టు కొట్టి.. తమ సత్తా చాటాలని నిర్మాత భావిస్తున్నారు.

అటు నాని కూడా సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘ఎం.సి.ఎ’ తర్వాత నాని సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఆ ముచ్చట ‘దసరా'(Dasara) తో తీర్చుకోవాలనుకుంటున్నాడు. పైగా అతని కెరీర్లోనే ఈ చిత్రానికి హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఆల్రెడీ 60 శాతం రికవరీ అయినట్లు ఇన్సైడ్ టాక్.

ఇదిలా ఉండగా.. ‘దసరా’ కి ఓ విషయం మాత్రం పెద్ద మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. అదేంటి అంటే.. ఈ చిత్రం పక్కా తెలంగాణ స్లాంగ్ లో సాగుతుంది. ట్రైలర్ పరంగా చూసుకుంటే నాని పలికిన డైలాగులు చాలా మందికి అర్థం కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమా కథ విన్నప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కే అర్ధం కాలేదు అని చెప్పిన సంగతి తెలిసిందే.

పైగా ఇది పక్కా ‘రా’ కంటెంట్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలి అంటే సుకుమార్ ‘రంగస్థలం’ ని తీర్చిదిద్దినట్టు తీర్చిదిద్దాలి. మరి అతని శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఆ రేంజ్లో ‘దసరా’ తీర్చిదిద్దాడో లేదో మార్చి 30న తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus