‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

తొలిసారి ఇద్దరి స్టార్ హీరోలు నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రానికి ఓ స్టార్ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ఏదైనా ఉందా అంటే… ఇండియన్ వైడ్ ప్రేక్షకులు చెప్పే సమాధానం ‘ఆర్.ఆర్.ఆర్’. తెలుగులో దీని పూర్తి పేరు ‘రౌద్రం రణం రుథిరం’. రాంచరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ … కొమరం భీమ్ గా నటిస్తోన్న ఈ చిత్రం నుండీ ఇటీవల ఓ వీడియోని వదిలాడు దర్శకుడు రాజమౌళి.

రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా .. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఈ వీడియోని వదిలాడు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో మరో వీడియోని విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా… ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ మరో వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.అదేంటంటే.. ఈ చిత్రంలో.. భీమ్, సీతారామరాజులు మొదటిసారి ఓ అడవిలో ఎదురుపడినప్పుడు..

ఈ ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుందట. ఈ ఫైట్‌ను రాజమౌళి భారీ ఎత్తున తెరకెక్కించాడని తెలుస్తుంది. సినిమాకే హైలెట్‌గా ఈ ఫైట్ నిలుస్తుందని సమాచారం. పది నిమిషాలకు పైనే ఈ ఫైట్ ఉంటుందట. ఎన్టీఆర్, చరణ్‌లు నువ్వా నేనా అన్నట్లు నటించారని కూడా సమాచారం. సరిగ్గా ఈ సీన్ దగ్గరే ఇంటర్వెల్ కార్డు పడుతుందట.తెలుసుకుంటుంటేనే ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది కదూ..! తప్పదు… జనవరి 08 2021 వరకూ వేచి చూడాల్సిందే..!

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus