గత కొద్ది సంవత్సరాలుగా ఇండియాలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరు ? అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సన్నీలియోన్. వీరిద్దరి మధ్య పెద్ద పోటీ ఉండేది.. ఒక్కోసారి సన్నీ లియోన్.. మోడీని క్రాస్ చేసి టాప్ ప్లేస్ లో ఉండేది. అయితే ఇప్పుడు సన్నీ లియోన్ సైడ్ అయిపోయింది. మోడీ గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. లిస్టులో ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ టాప్‌లో నిలిచింది.
ఈ యేడాది ఆమె సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకుంది. పైగా సినిమాలు, ఫోటోషూట్లతో బిజీగా ఉంది. దీంతో ఎక్కువమంది ఆమె గురించి సెర్చ్ చేసినట్టు గూగుల్ వెల్లడించింది. ఈ విషయంలో కియారా.. ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, ఆలియా భట్‌ను సైతం వెనక్కి నెట్టింది. అలా 2023లో తన పాపులారిటీ బాగా పెంచుకుంది. ప్రస్తుతం కియార అద్వానీ సౌత్‌లో రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.
ఇక ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన వ్యక్తులు జాబితాలో ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ రెండో స్థానంలో నిలిచారు. తన ఆటతో పాటు డేటింగ్ వ్యవహారాలతో తరచూ వార్తల్లో వ్యక్తిగా మారాడు. శుభమాన్ గిల్ ఇక మూడో స్థానంలో భారతీయ మూలాలు ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్ రచన్ రవీంద్ర నాలుగో స్థానంలో ప్రపంచకప్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో దుమ్ము దులిపిన మహమ్మద్ షఫీ నిలిచారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మోస్ట్ సెర్చ్ డ్ హీరోయిన్ గా (Kiara Advani) బార్బీ మూవీ బ్యూటీ మార్గోట్ రాబి నిలిచారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే.