Arohi Rao: ఆరోహి ఎలిమినేషన్ కి అసలు కారణం ఇదేనా..! జరిగిందేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం అనూహ్యంగా ఆరోహి ఎలిమినేట్ అయిపోయింది. మొదటి వారం ఎలిమినేషన్ లేకపోయినా రెండోవారం ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ నుంచీ పంపించేశారు. షానీ, అభినయశ్రీ ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా, మూడోవారం నేహా ఎలిమినేట్ అయిపోయింది. ఈవారం ఇస్మార్ట్ పోరి ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఆర్జే సూర్యతో మంచి కెమెస్ట్రీ వర్కౌట్ చేస్తున్నా కూడా ఆరోహి ఎందుకు ఎలిమినేట్ అయ్యిందంటూ నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. కొన్ని అసలు కారణాలు చూసినట్లయితే.,

నెంబర్ – 1

ఆరోహి గేమ్ పరంగా చాలా వెనకబడింది. ఆర్జే సూర్య సపోర్ట్ తోనే గేమ్ లో ముందుకెళ్లింది. ఒక్కోసారి సోలాగా గేమ్ ఆడినా కూడా సూర్యకోసం త్యాగం చేసింది. దీనివల్ల టాస్క్ లలో ముందుకెళ్లలేదు. అందుకే ఆటలో కంటే కూడా సూర్యతోనే ఎక్కువగా కనిపించింది. మిగతావాళ్లతో బాండింగ్ ఉన్నా కూడా ఎక్కువగా సూర్యతోనే ఉండటం వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది.

నెంబర్ – 2

సోషల్ మీడియాలో ఆరోహికి పెద్దగా ఫాలోవర్స్ లేకపోవడం అనేది పెద్ద మైనస్. దీనివల్ల ఓటింగ్ అనేది ఆరోహికి పెద్దగా జరగలేదు. మొదటి వారం కూడా డేంజర్ జోన్ లో ఉంది ఆరోహి. ఓటింగ్ లో బాగా వెనకబడిపోయింది.

నెంబర్ – 3

హౌస్ లో మిగతా హౌస్ మేట్స్ గేమ్ కంటే కూడా ఆరోహి గేమ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తనకంటే వీక్ గా ఉన్న వాసంతీ కూడా ఏదో రకంగా టాస్క్ లో కనిపించింది. కానీ, ఆరోహి మాత్రం భిన్నమైన స్ట్రాటజీవల్ల గేమ్ లో వెనకబడిపోయింది. ముఖ్యంగా అడవిలో ఆట టాస్క్ లో దొంగల టీమ్ లో ఉన్న ఆరోహి రేవంత్ బొమ్మలని దొబ్బేయడం అనేది మైనస్ అయిపోయింది. ఆటలో స్ట్రాటజీ అనుకుంది కానీ, అన్ ఫెయిర్ గేమ్ అని ఊహించలేకపోయింది. అంతేకాదు, అదే వారం కెప్టెన్ రాజ్ తో పెట్టుకున్న వాగ్వివాదం ఆమె గేమ్ ని దెబ్బకొట్టింది. తన ఆర్గ్యూమెంట్ కరెక్ట్ గానే ఉన్నా కూడా కెప్టెన్ మాట వినకపోవడం మైనస్ అయ్యింది. ఇదే పాయింట్ నామినేషన్స లో ఎదుర్కోవాల్సి వచ్చింది.

నెంబర్ – 4

హౌస్ మేట్స్ లో కొంతమందితో మాత్రమే మింగిల్ అవ్వగలిగింది ఆరోహి. నాలుగు వారాలు గేమ్ ఆడినా కూడా అందరితో కలవలేకపోయింది. కేవలం కొంతమందితో మాత్రమే టైమ్ పాస్ చేసింది. అంతేకాదు, హౌస్ లో తన తోటి హౌస్ మేట్స్ డామినేట్ చేస్తూ ముందుకెళ్లి పోతున్నా కూడా గమనించుకోలేకపోయింది.

నెంబర్ – 5

సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోవర్స్ లేని ఆరోహికి ఓటింగ్ శాతం చాలా తక్కువగా జరిగింది. అంతేకాదు, ఆర్జే సూర్యతో పాటుగా నామినేషన్స్ లో ఉండటం అనేది మైనస్ అయ్యింది. పదిమందితో కలిసి నామినేషన్స్ లో ఉండటం వల్ల ఓటింగ్ లో వెనకబడింది. తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ఎవరూ నామినేషన్స్ లో లేకపోవడం తన ఎలిమినేషన్ కి దారితీసింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus