ఎన్టీఆర్- చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ పై షూటింగ్ ప్రారంభమవడానికి ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ (సిరీస్) తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ మూవీ సెట్స్ పై ఉండగానే భారీ ప్రీ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మరియు ఓ స్టార్ దర్శకుడు వాటికి తోడు ‘బాహుబలి’ క్రేజ్.. అదనంగా యాడ్ అవ్వడంతో బయ్యర్స్ భారీ రేట్లు ముందు నుండే అడ్వాన్స్ లు ఇచ్చేసి ఆయా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.
ఫలితంగా లక్షల్లో ఇంట్రెస్ట్ లు కడుతున్నా.. కరోనా వచ్చి వారికి మరింత ఇబ్బంది ఎదురైనా వారు వెనుకడుగు వేయలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండేవి. అయితే ఈ మూవీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసింది. రూ.1050 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటింది. అయితే ‘బాహుబలి’ లా ప్రతీ ఏరియాల్లో ఈ మూవీ లాభాలను పంచలేదు.
గోదావరి జిల్లాల్లో కొన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ మాస్ సెంటర్స్ లో 10-15 శాతం నష్టాల్ని మిగిల్చాయట. కేరళలో కూడా అంతే సంగతి. బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఈ మూవీ లాభాలను పంచలేదు. బయ్యర్లు సగానికి సగం వెనకేసుకోవచ్చని భావిస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజాం మరియు ఓవర్సీస్ బయ్యర్లకి ఈ మూవీ లాభాల్ని పంచింది. కర్ణాటక, ఆంధ్ర,కేరళ వాటి ఏరియాల్లో ఈ మూవీ పెర్ఫార్మన్స్ అంతంత మాత్రమే..!