మన సినిమాలు అక్కడ రిలీజ్ చెయ్యట్లేదు… కానీ వాళ్ళ సినిమాలు బ్లాక్ బస్టర్స్ చేస్తున్నాం!

ఏ పండుగనైనా సినిమాతో సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి మనది. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తాం. అది చాలా గొప్ప అలవాటు. అలాంటి నేచర్ ఉండాలి కూడా..! అందుకే డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడతాయి. ఆడుతున్నాయి..! ఉదాహరణకి నిన్న అంటే దీపావళి రోజున 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 తెలుగు సినిమాలు ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) ‘క’ (KA) .. ఇంకో 2 డబ్బింగ్ సినిమాలు ‘అమరన్’ (Amaran) ‘భగీర’..!

Movie

ఇందులో 3 సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ‘బఘీర’ తప్ప.. మిగిలిన 3 బాగా ఆడుతున్నాయి. అందులో ‘అమరన్’ డామినేషన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మల్టీప్లెక్సుల్లో ఆ సినిమాకి బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ‘క’ ‘లక్కీ భాస్కర్’ కంటే ఆ సినిమాకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ కనిపిస్తుంది. డబ్బింగ్ సినిమాని మనం అలా నెత్తిన పెట్టుకుంటాం.

కానీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘క’.. తమిళంలో విడుదలకు నోచుకోలేదు. వారం తర్వాతే అక్కడ రిలీజ్ చేస్తామని లోకల్ డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా చెప్పారు. మరి మనవాళ్ళు అలా ఆలోచించడం లేదు కదా. ‘అమరన్’ కనుక లేకపోతే ‘క’ ‘లక్కీ భాస్కర్’..లకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి. మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా పండుగకి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఒకలా.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయితే ఇంకోలా ఆలోచిస్తున్నారు.

ఇది మంచి పద్ధతి కాదు. ‘అమరన్’ అనేది తమిళ సినిమా (Movie)..సేమ్ టైటిల్ తో రిలీజ్ చేస్తామని చెప్పినా మన డిస్ట్రిబ్యూటర్లు అడ్డు చెప్పడం లేదు. అదే తమిళ డిస్ట్రిబ్యూటర్లని తీసుకోండి ‘సరిపోదా శనివారం’ సినిమాకి ‘సూర్యస్ సాటర్ డే’ అనే టైటిల్ పెడితేనే కానీ రిలీజ్ కి ఒప్పుకోలేదు. వాళ్లకు ఉన్న ఐకమత్యం మనకి కూడా ఉండాలి కదా మరి.

వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్- తరుణ్.ల రేర్ ఫోటో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus