దర్శకధీరుడు రాజమౌళి.. ‘ఈగ’ చిత్రానికి ముందు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ పేరు… ఆ చిత్రంతో ఇతర భాషల్లో కూడా పాపులర్ అవ్వడం మొదలైంది. ‘బాహుబలి’ (సిరీస్) తో అది డబుల్ అయ్యింది కూడా. ‘అపజయమెరుగని దర్శకుడు రాజమౌళి’ అని ఇండియా మొత్తం తెలుసుకుంది. అయితే ఇతని విజయ రహస్యం ఏంటని.. రాజమౌళినే అడిగితే.. ‘నా కుటుంబమే ‘ అని చెబుతుంటాడు. అది నిజమే అని కూడా చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాజమౌళి భార్య రమ గారు డిజైన్ చేసే కాస్ట్యూమ్స్.. ఆయన సినిమాల్లో హైలెట్ గా నిలుస్తుంటాయి అనడంలో సందేహం లేదు.
రాజమౌళి,రమ లను… ఇండస్ట్రీలో అందరూ ఆదర్శ దంపతులు అంటుంటారు. వీరిది కూడా ప్రేమ వివాహమే. అసలు వీళ్ళ ప్రేమ ఎలా మొదలైంది..? అది పెళ్ళి వరకూ ఎలా వెళ్ళింది? అసలు వీళ్ళను ఆదర్శ దంపతులు అని ఎందుకు అంటుంటారు? అనే విషయాలు చాలా మందికి తెలీదు. నిజానికి రాజమౌళిని పెళ్ళి చేసుకోవడానికి ముందే రమ కు వేరే వ్యక్తితో పెళ్ళైంది. కార్తికేయ… రమ మొదటి భర్త కొడుకు. అయితే రమ తన మొదటి భర్తతో.. అభిప్రాయ భేదాల వల్ల విడిపోయింది. అయితే తరువాత రాజమౌళి పరిచయం అవ్వడం.. వారి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది.

కీరవాణికి రాజమౌళి.. తమ్ముడు వరుస. ఇక కీరవాణి భార్య వల్లి.. స్వయానా రమకు చెల్లెలు కావడం విశేషం. ఇక ‘శాంతినివాసం’ సీరియల్ టైం నుండీ రాజమౌళి, రమ లకు పరిచయం ఏర్పడిందట. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా టైములో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అంతే… సింపుల్ గా ఏ హడావిడి లేకుండా పెళ్ళి చేసుకున్నారు. రమకు సంతానం ఉంది. కానీ రాజమౌళి పిల్లల కోసం కోరుకోలేదట. ఓ పాపను దత్తత తీసుకున్నాడు. ఆమెనే మయూఖ. కార్తికేయను కూడా రాజమౌళి సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాడట. నిజంగానే రాజమౌళి,రమ లది ఎంతో ఆదర్శమైన కుటుంబం అని ఒప్పుకోవాల్సిందే.
1

2

3

4

5

6

7

8

SS Rajamouli & Rama Rajamouli @ Eega Working Stills
9

S.S Rajamouli, Rama Rajamouli attends Tommy Hilfiger Showroom Relaunch Party held at Kismet Pub, Park Hotel, Hyderabad on 17th September 2011 shown to user
10

11

12

13

14

15

16

17

Rama, SS Rajamouli @ Actor Raja Ravindra’s Daughter Wedding Photos
18

19

20

21

22

23

24

25

Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
