సినిమా ఇండస్ట్రీలో కథ, కథనాలు.. హీరోలు, వారి క్యారెక్టర్ల పేర్లు.. సంగీతం, పాటలు, పోస్టర్లు.. ఇలా ప్రతి విషయంలో ఏదో ఒక పోలిక ఉండే ఉంటుంది.. కొన్ని సార్లు సెంటిమెంట్ రీత్యా రిపీట్ చేసుండొచ్చు.. మరి కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోయిండొచ్చు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, మీమ్స్ పేజీల కారణంగా పాత సినిమాల నుండి లేటెస్ట్ వరకు అన్ని విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.. అలాంటి సంఘటనలు చాలానే చూశాం.. ఇప్పుడు మూడు సినిమాలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళ్తే..
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో హీరోల క్యారెక్టర్ల పేర్లు గురించే ఆ పోలిక.. చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. కె.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ‘స్నేహంకోసం’.. ఇందులో పెద్ద చిరంజీవి క్యారెక్టర్ హైలెట్.. ఆ పాత్ర పేరు ‘సింహాద్రి’.. సినిమాలో ఈ రోల్ ఎంత కీలకమో తెలిసిందే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం ‘సింహాద్రి’.. నూనుగు మీసాల ప్రాయంలో అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టాడు తారక్.. ఈ సినిమా సృష్టించి ప్రభంజనం అంతా ఇంతా కాదు.. వర్షాకాలంలోనూ వసూళ్ల వరద పారించింది.. ఇందులో టైటిల్ రోలే కాదు.. టైటిల్ పవర్ ఫుల్ ‘సింహాద్రి’ కదా మరి.. అల్లు అర్జున్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఎమోషనల్,
లవ్ ఎంటర్‌టైనర్ అండ్ మ్యూజికల్ హిట్ మూవీ.. ‘గంగోత్రి’.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బన్నీ.. ఇందులోనూ అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరు ‘సింహాద్రి’ నే కావడం విశేషం.. ఇదే పేరుతో హీరో క్యారెక్టర్ ఉన్న మరికొన్ని సినిమాలు ఉండే ఉండొచ్చు కానీ ఈ మూడిటి మధ్య పోలిక మాత్రం భలే కుదిరిందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..