అప్పుడెప్పుడో చిన్న వివాదంలా మొదలై.. ఆ తర్వాత సమసిపోయి ఇప్పుడు తుపానులా మారింది ‘ది కేరళ స్టోరీ’. సినిమాలో ఏముందో పూర్తిగా తెలియకపోయినా ఏదో ఉంది అంటూ చాలామంది విమర్శలు చేశారు. అయితే ట్రైలర్ వచ్చాక అందులో కాస్త ఇబ్బందికర కంటెంట్ ఉందని ఫిక్స్ అయ్యి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ విమర్శల వివాదంగా మారింది. అయితే చాలా సినిమాలకు ఉపయోగపడినట్లు ఈ సినిమాకు వివాదం కలసి రాలేదు. దీంతో సినిమా ఓటీటీ బాట పడుతోంది.
కొన్ని రాష్ట్రాల్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి కూడా కొంతమంది ధైర్యం చేయలేకపోతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని థియేటర్లలో అయితే అనుకున్న షోస్‌ను రద్దు చేస్తున్నారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏకంగా బహిష్కరిస్తున్నారు. అయితే విడుదలైన రాష్ట్రాల్లో మాత్రం వసూళ్ల వరద పారుతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి రిలీజ్ చేస్తే ఆయా రాష్ట్రాల్లో వచ్చిన రెస్పాన్స్ ఓటీటీలోనూ వస్తుందని టీమ్ ఆశిస్తోంది అని సమాచారం.
మే 5న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా OTT హక్కులు ఇప్పటికే అమ్మేశారని సమాచారం. ఓటీటీ వర్గాల సమాచారం ప్రకారం అయితే జీ5 చేతిలో ఈ రైట్స్ ఉన్నాయట. థియేట్రికల్ రిలీజ్‌కి 4 – 6 వారాల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని తొలుత అనుకున్నారట. అంటే జూన్ మూడో వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఇంకాస్త ఎర్లీగా సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేస్తారని అంటున్నారు. ‘కేరళ స్టోరీ’ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన (The Kerala Story) ఈ సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. ఇక ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నిషేధించారు. ఇదే దారిలో మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయని అంటున్నారు. అంతగా సినిమాలో ఇబ్బంది ఏముంది అనుకుంటున్నారా? కేరళ నుండి ఇస్లాం మతంలోకి మారి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)లో చేరిన మహిళల సమూహం చుట్టూ ఈ కేరళ స్టోరీ కథాంశం తిరుగుతుంది. కేరళకు చెందిన వేలాది మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చి ఐసిస్‌లోకి చేర్చుకుంటున్నారని ఈ సినిమాలో చూపించారు అనేది సినిమా సారాంశం అంటున్నారు.