Kamal Haasan: కమల్ నటించిన పాత విక్రమ్ కి.. లేటెస్ట్ విక్రమ్ కి ఉన్న పోలికలు..!

కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజన్.. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ తో సినిమా తీశాడు.. అది కూడా కమల్ హాసన్ వంటి సీనియర్ స్టార్ హీరోతో..! అదే ‘విక్రమ్’ మూవీ. మార్వెల్ సిరీస్ లు చూసే వారికి ఇది కొత్తేమి కాదు. కథగా చూసుకుంటే ‘విక్రమ్’ కొత్త అనుభూతిని ఇవ్వదు. ఇది రొటీన్ రెగ్యులర్ రివేంజ్ డ్రామానే. కానీ ఈ సినిమాలో కొన్ని పాత సినిమాల క్యారెక్టర్లను ప్రవేశ పెట్టి..ప్రేక్షకులను థ్రిల్ చేశాడు దర్శకుడు.

‘ఖైదీ'(2019) లో ఢిల్లీ(కార్తీ) పాత్రని, కమల్ నటించిన పాత ‘విక్రమ్’ పాత్రని తీసుకుని కొత్త ప్రయోగం చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది. అయితే కమల్ పాత ‘విక్రమ్’ కి దీనికి పోలిక ఏంటి అనే డౌట్ చాలా మందిలో ఉంది. 1986 లో వచ్చిన కమల్ విక్రమ్ లో ఆయన స్పెష‌ల్ ఏజెంట్‌ గా కనిపిస్తాడు. అగ్ని పుత్ర అనే మిస్సైల్‌ను ఓ వ్య‌క్తి (స‌త్య‌రాజ్‌) దొంగిలిస్తాడు. దాంతో భార‌తదేశాన్ని నాశ‌నం చేయడానికి చూస్తాడు.

అయితే చివ‌ర‌కు ఏజెంట్ విక్ర‌మ్‌, కంప్యూట‌ర్ స్పెష‌లిస్ట్ ప్రీతి (లిజి)తో క‌లిసి అగ్ని పుత్ర ద్వారా క‌లిగే న‌ష్టం నుంచి ఇండియాని ఎలా కాపాడారు అనేది మిగిలిన కథ. రాజశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆద్యంతం థ్రిల్ చేసే విధంగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని కూడా ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించాడు.

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ఇందులో ‘ఏజెంట్’ విక్రమ్ పాత్రనే.. ఇటీవల వచ్చిన విక్రమ్ లో కర్ణన్ గా చూపించి ఆ తర్వాత అతని విశ్వరూపాన్ని బయటపెట్టాడు దర్శకుడు. అతని కొడుకు ప్రభంజన్ ను కొందరు వెన్నుపోటు పొడవడం.. సీక్రెట్ గా వాళ్ళని కమల్ చంపి.. వాళ్ళ ఆట కట్టించినట్టు చూపించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus