సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదగడం, సక్సెస్ సాధించడం తేలిక కాదు. ఎంతో శ్రమిస్తే మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ దక్కుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ అందుకున్న హీరోలలో ఎక్కువమంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు అనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య, లూసిఫర్ రీమేక్ లలో నటిస్తున్నారు. అయితే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఏ విధంగా వచ్చిందనే సంగతి చాలామంది అభిమానులకు తెలియదు.
66 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి వేగంగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. మరణ మృదంగం సినిమాలో స్క్రీన్ పై తొలిసారి మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. అప్పటివరకు చిరంజీవి సినిమాలకు సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. మెగాస్టార్ చిరంజీవి, కేఎస్ రామారావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.
ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా దసరా రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా కేఎస్ రామారావు నిర్మాతగా రాబోయే రోజుల్లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న లూసిఫర్, వేదాళం సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియాల్సి ఉంది. చిరంజీవి కథలు వింటున్నారని త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.