మన నందమూరి బాలయ్య సినిమాల్లో చెప్పే డైలాగులు ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో మాత్రమే కాక ఫారిన్ కంట్రీస్ లో కూడా బాలయ్య డైలాగులకి, యాక్షన్ సీన్స్ కి కూడా భారీస్థాయిలో అభిమానులున్నారు. అయితే.. ఈమధ్యకాలంలో బాలయ్యబాబు సినిమాల్లో చెప్పే డైలాగులకంటే ఎక్కువగా ఆయన స్టేజీ మీద చెప్పే స్పీచ్ లు ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. “లెజండ్” ఆడియో వేడుకలో బాలయ్య స్పీచ్ చూస్తే ఇప్పటికీ నవ్వు ఆగదు. ఆ తర్వాత కూడా ఆ తరహాలో బోలెడన్ని స్పీచ్ లు ఇచ్చాడు బాలయ్య. కానీ.. నిన్న సాయంత్రం “అరవింద సమేత” సక్సెస్ మీట్ కి వచ్చిన బాలయ్య హీరోయిన్ పూజా హెగ్డేను పొగుడుతూ హిందీలో చెప్పిన కవిత అర్ధం కాకపోయినా ఆహుతులను, వీక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.
ఇంతకీ బాలయ్య చెప్పిన కవితకి అర్ధం ఏంటో తెలుసుకొందామని పాతబస్తీ స్నేహితులను అడగ్గా వారు చెప్పిన సమాధానం భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలయ్య చెప్పిన కవిత.. “లగ్తాహై ఆస్మాన్ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ హై”. దానికి అర్ధం ఏమిట్రా అంటే.. “పాలరాతి భవనం నిర్మించడానికి వచ్చిన ఓ దేవకన్యా.. నువ్వు నడిచే ప్రతి దారి సంతోషంతో నిండిపోతుంది, ప్రతి ఆకు రోజాపువ్వు రేఖులా మారిపోతుంది, నీ మత్తైన చూపు పడితే మంచు కూడా మందు (సురాపానం)లా మారిపోతుంది” అని అర్ధం. సో, మన బాలయ్య హీరోయిన్ పూజా హెగ్డేని దేవకన్యతో పోల్చి ఆమె రేంజ్ ను అమాంతం పెంచేశాడు. నిన్న మరి అర్ధమైందో లేదో తెలియదు కానీ.. పూజా హెగ్డే కూడా బాలయ్య తనను పొగుడుతున్నప్పుడు మూసిముసిగా నవ్వుకుంది.