Mahesh Babu: హైదరాబాద్ లో మహేష్ హోటల్స్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు ప్రమోటర్ గానూ వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటాడనే సంగతి తెలిసిందే. దాంతోపాటు ‘బిజినెస్ మెన్’ గానూ దూసుకుపోతున్నాడు. ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ నెలకొల్పి థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నాడాయన. భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించనున్నాడు.

ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో లగ్జీరియస్ హోటల్స్ స్థాపించి, సక్సెస్ అయితే థియేటర్ బిజినెస్ మాదిరిగానే ఇండియా అంతటా తమ హోటల్స్ ని విస్తరింపజెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. మహేష్ బాబు ముందుగా ఏర్పాటు చేస్తున్న రెండు హోటళ్లకు పేర్లు కూడా కన్ఫామ్ చేసేశారు. వాటిలో ఒకటి ‘మినర్వా ఎఎన్’ (ఏషియన్ నమ్రత) నవంబర్ లో, మరొకటి ‘పాలస్ హైట్స్’ డిసెంబర్ లో ప్రారంభించనున్నారు. వీటిలో ఒకటి బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర్లో ఉంటుందట.

ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ హోటల్స్ లో పార్కింగ్ కోసం ఎక్కువ స్పేస్ కేటాయించనున్నారు. ఆఫ్ స్క్రీన్ మహేష్ కి సంబంధించిన అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకునే నమ్రత ఈ హోటల్ వ్యవహారాలను కూడా పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం తన 28వ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడు సూపర్ స్టార్.. వీళ్ల కాంబినేషన్ లో ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చిన సంగతి తెలిసిందే.

దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్.. 2023 సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.. ఇది కంప్లీట్ అవగానే.. రాజమౌళి మూవీకి షిఫ్ట్ అవనున్నాడు.. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus