బాలయ్య సింహాద్రి చేయకపోవడానికి కారణం అదేనా?

  • April 28, 2020 / 04:02 PM IST

దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సింహాద్రి. 2003లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. టాలీవుడ్ ఆల్ టైం టాప్ గ్రాస్సర్ గా రికార్డ్ నెలకొల్పిన ఈ చిత్రం 100 డేస్ 175 సెంటర్స్, 175 డేస్ 52 డైరెక్ట్ సెంటర్స్ లో ఆడి కొత్త రికార్డ్స్ నెలకొల్పింది. ఇప్పటికి కూడా సింహాద్రి 175 డేస్ సెంటర్స్ రికార్డు చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా అందుకోగా డైరెక్టర్ రాజమౌళి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. రాజమౌళి పేరు ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చిన సినిమా సింహాద్రి.

ఆయనికిది కేవలం రెండో చిత్రం మాత్రమే. ఎన్టీఆర్ అప్పటికే ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఉన్నాడు. సింహాద్రి ఎన్టీఆర్ కి 7వ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమా నిజానికి రాజమౌళి బాలకృష్ణతో చేద్దాం అనుకున్నారట. ఆయనకు సింహాద్రి సినిమా స్టోరీని కూడా చెప్పాడట. కథ విన్న తరువాత బాలకృష్ణ నచ్చక రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత రాజమౌళి తన ఫస్ట్ సినిమా హీరో ఎన్టీఆర్ ని కలవడంతో ఈ కథను ఆయన ఒకే చేశాడు. మరి ఒక వేళ సింహాద్రి సినిమా బాలకృష్ణ చేసుంటే ఆ స్థాయి హిట్ అయ్యేదా అంటే చెప్పలేం. యజమాని దగ్గర పాలేరుగా ఉండే యువకుడిగా బాలయ్య సెట్ అయ్యేవాడా అంటే డౌటే అని చెప్పాలి.

దానికి తోడు అప్పటివరకు బాలయ్య వరుసగా అదే తరహా ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామాలు చేసుకుంటూ వస్తున్నారు. అంతకు ముందు ఏడాది బాలకృష్ణ దర్శకుడు వి వి వినాయక్ తో చెన్నకేశవ రెడ్డి సినిమా తీసి ఉన్నారు. అలాగే బాలకృష్ణ సమరసింహా రెడ్డి , సింహాద్రి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ లైన్ దగ్గిరి పోలికలు కలిగి ఉంటాయి. కాకపోతే ఒక సినిమా రాయలసీమ నేపథ్యం కలిగి ఉంటే మరో సినిమా కేరళ నేపథ్యంలో తెరకెక్కింది. ఏదిఏమైనా బాలయ్య సింహాద్రి చేసి ఉంటే హిట్ అయ్యేదో లేదో చెప్పలేం. కాకపోతే ఆ ఏడాది బాలయ్య బి గోపాల్ తో చేసిన పలనాటి బ్రహ్మనాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus