‘ఆచార్య’ సినిమా మొదలైన కొద్ది రోజుల్లో… ఈ సినిమాలో మరో హీరో ఉన్నాడు అనే విషయం బయటికొచ్చింది. ఆ హీరో ఎవరు అనే విషయంలో చాలా రకాల చర్చలు, పుకార్లు వచ్చాయి. ఈ హీరో ఓకే అయిపోయాడు, ఆ హీరో రెడీ అంటూ చాలా పేర్లు వినిపించాయి. అయితే ఆఖరిగా రామ్‌చరణ్ మాత్రమే ఫిక్స్ అయ్యాడు. అయితే దీని వెనుక చాలా పెద్ద తతంగమే జరిగింది అని చెబుతున్నారు చరణ్, కొరటాల శివ.
చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘ఆచార్య’ కథ రాశాను అని చెప్పారు కొరటాల శివ. అయితే సినిమాలోని మరో కీలక పాత్ర కోసం పెద్ద స్టార్‌డమ్ ఉన్న హీరోను తీసుకోవాలనుకున్నా. గురుకులంలో పెరిగిన అబ్బాయి పాత్ర అది. ఇమేజ్ ఉన్న హీరో అయితే ప్రభావం ఎక్కువగా ఉంటుందనిపించింది. ఈ పాత్ర కోసం ఎవరా అని చూస్తున్నప్పుడు చరణ్ అయితే బాగుంటుంది అనిపించింది అని కొరటాల చెప్పారు.
రామ్‌చరణ్ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడు. అచ్చంగా గురుకులం విద్యార్థిలా అనిపిస్తాడు. అందుకే సినిమాలోని సిద్ధ పాత్రకు ఆయన్ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నారు కొరటాల. అయితే ఆ సమయంలో చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో బిజీగా ఉన్నారని తెలిసింది. దీంతో కాస్త సందేహంతోనే నా మనసులో మాట ఆయనకు చెప్పా అని చెప్పారు కొరటాల. కానీ చరణ్ ‘ఆచార్య’లో నటించడానికి వెంటనే ఓకే చెప్పారు. ‘ఎంత కష్టమైనా తప్పకుండా చేద్దాం’ అని భరోసా ఇచ్చారు అని తెలిపారు కొరటాల.
అయితే ఈ సినిమా కోసం చరణ్‌ను తీసుకోవాలంటే రాజమౌళిని ఒప్పించాలి. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా మా సినిమాకు కావాలి అనడం ఎలా అనుకున్నారట కొరటాల. దీంతో చిరంజీవి దగ్గరకు వెళ్లింది ఈ చర్చ. ఆయన రాజమౌళితో మాట్లాడి చరణ్ ‘ఆచార్య’లో చేయడానికి కొన్ని రోజులు విడిచిపెట్టమని ఒప్పించారు అని కొరటాల చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరినీ ఒకేసారి స్క్రీన్‌పై చూడాలనేది తన తల్లి కోరిక అని రామ్ చరణ్ వెల్లడించాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!