Nupur Sanon: ఎవరూ ఏదీ అనుకోకుండా ముందే చెప్పేసిన మంచు విష్ణు!

మంచు విష్ణు ఆ మాటకొస్తే మంచు మోహన్‌బాబు ఎన్నో ఏళ్లుగా కలల ప్రాజెక్ట్‌ అని చెబుతున్న చిత్రం ‘కన్నప్ప’. దర్శకులు, రచయితల పేర్లు చాలా వినిపించినా.. ఎవరూ ఓకే అవ్వలేదు. అలాగే సినిమా మొదలవ్వలేదు. అయితే రీసెంట్‌గా సినిమాను ఘనంగా ప్రారంభించారు. ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని ఇటీవల ఘనంగా ప్రకటించారు. దీనికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారని కూడా చెప్పారు.

అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు వచ్చిన సమస్య ఇప్పుడ సినిమా ప్రారంభం తర్వాత కూడా వస్తోంది. అప్పుడే ఈ సినిమా నుండి కథానాయిక బయటకు వెళ్లిపోయింది. సినిమాలో నాయికగా యువ కథానాయికగా నుపుర్‌ సనన్‌ను తీసుకున్నామని ఇటీవల సినిమా ప్రారంభం సందర్భంగా విష్ణు ప్రకటించారు. అయితే ఆమెకు ఇతర సినిమాల డేట్స్‌తో క్లాష్‌ రావడం వ్లల ఆమె సినిమా నుండి తప్పుకుంది అని మంచు విష్ణు తెలిపారు.

సినిమాకు డేట్స్‌ సర్దుబాటు చేయడంలో సమస్యలు రావడం వల్ల (Nupur Sanon) నుపుర్‌ సనన్‌ ‘కన్నప్ప’ సినిమా నుండి తప్పుకున్నారు అని విష్ణు ట్వీట్‌ చేశారు. ఈ విషయం ప్రకటించడం బాధగా ఉందని, ఆమెను తామంతా మిస్‌ అవుతామని కూడా చెప్పడు. కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నామని… ఎంపిక చేయగానే చెబుతామని విష్ణు తెలిపాడు. నుపుర్‌ చేస్తున్న, చేయబోతున్న సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని కూడా రాసుకొచ్చాడు.

అంతేకాదు త్వరలోనే మేమిద్దరం కలసి వర్క్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి తమ మధ్య ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పకనే చెప్పాడు విష్ణు. నుపుర్‌ ప్రస్తుతం రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా మరే కొత్త సినిమాలు ఇక్కడ ఓకే చేయలేదు. అలాగే బాలీవుడ్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సినిమా ఒక్కటే చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో సినిమాల డేట్స్‌ క్లాష్‌ ఎక్కడ అనేది ఓ ప్రశ్న.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus