డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేయడానికి నటుడు సందీప్ కిషన్ ఎప్పుడూ ముందుంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతను చేసినన్ని ప్రయోగాలు యంగ్ హీరోలు ఎవరూ చేయలేదు అనే చెప్పాలి. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన లోకేష్ కనగరాజ్ కి, టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన హను రాఘవపూడికి.. డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించింది సందీప్ కిషన్. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసుండదు. ఈరోజుల్లో టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఒక టాలెంట్ అనే చెప్పాలి.
అది సందీప్ కిషన్ కి ఉంది. కానీ సక్సెస్ మాత్రం అతని హైట్ కి తగ్గట్టు ఆరడుగుల దూరంలోనే ఆగిపోతుంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఎందుకో వాయిదా పడుతూ వస్తోంది. వి ఐ ఆనంద్ (Ooru Peru Bhairavakona) ఈ చిత్రానికి దర్శకుడు. ఇతని గత చిత్రం ‘డిస్కో రాజా’ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
అయినప్పటికీ సందీప్ కి ఇతను గతంలో సందీప్ తో ‘టైగర్’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చాడు. ఇక నిర్మాత అనిల్ సుంకర కూడా ప్లాపుల్లో ఉన్నారు. అయితే మరో నిర్మాత రాజేష్ దండాతో కలిసి ఆయన చేసిన ‘సామజవరగమన’ హిట్ అయ్యింది. మరోపక్క సందీప్ నటించిన ‘మైఖేల్’ కూడా నిరాశపరిచింది. సో సందీప్ తో పాటు వి ఐ ఆనంద్, అనిల్ సుంకర..లకు కూడా ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అందుకే లేటైనా పర్వాలేదు కానీ.. ఔట్పుట్ బాగా వచ్చాకే ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.