Mahesh Babu: సర్కారు వారి పాట సైలెన్స్ వెనుక అసలు కారణాలివే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట 2022 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో సర్కారు వారి పాట ఏకంగా రెండున్నర నెలలు ఆలస్యంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై అంచనాలను పెంచినా ఈ సినిమా నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట మేకర్స్ సైలెన్స్ వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఇప్పటినుంచే సర్కారు వారి పాట ప్రమోషన్స్ ను మొదలుపెడితే ఏప్రిల్ నాటికి సినిమాపై ఆసక్తి తగ్గుతుందని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. సర్కారు వారి పాట సంక్రాంతికే రిలీజై ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలై ఉండేవి. మైత్రి మూవీ మేకర్స్ ను సర్కారు వారి పాట అప్ డేట్ కావాలని అడిగిన ఫ్యాన్ కు నిర్మాతలు “సమయం ఉందన్నా.. అప్ డేట్ వచ్చినప్పుడు కచ్చితంగా రచ్చ చేస్తుంది” అంటూ సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా నుంచి అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కానుంది. సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బిజీ కానున్నారు. గీతా గోవిందం మూవీ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus