తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కళాతపస్వి కె . విశ్వనాథ్ గారు ఒకరు. ఈరోజు ఆయన కన్నుమూశారు. ఈయన ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయలేదు. తిప్పికొడితే 50 మాత్రమే..! అయినా తన సినిమాలతో అన్ని చిత్ర పరిశ్రమలను తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామానికి చెందిన ఈయన 1930 ఫిబ్రవరి 19న శ్రీ కాశీనాధుని సుబ్రహ్మణ్యం, శ్రీమతి సరస్వతమ్మ దంపతులకు జన్మించారు.
పెద్దయ్యాక చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘ఆత్మగౌరవం’. అటు తర్వాత ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘శృతి లయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ వంటి ఎన్నో గొప్ప చిత్రాలను ఈయన తెరకెక్కించి తెలుగు సినిమా రేంజ్ ని పెంచారు. విశ్వనాథ్ గారిలో గొప్ప నటుడు కూడా ఉన్నాడు. 30 కి పైగా సినిమాల్లో ఈయన నటించి మెప్పించారు. నిజంగా టాలీవుడ్ ఓ ఫిలిం మేకర్ ను కోల్పోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక కె.విశ్వనాథ్ గారి అకాల మరణానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 92 ఏళ్ళ వయసున్న వ్యక్తి కాబట్టి.. వయోభారం కూడా తోడవడంతో ఈయన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణమయ్యింది. కొన్నాళ్లుగా ఆయన ఆసుపత్రిలకు ఎక్కువగా తిరుగుతూ వచ్చారు. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా కె.విశ్వనాథ్ గారి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?