Samantha: ఆ ఒక్క కారణంతోనే సమంత పెద్ద ఎత్తున విరాళం ఇస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత అనంతరం కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగ కొనసాగుతున్నటువంటి ఈమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం అలాగే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా సౌత్ టు నార్త్ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలోనే సమంత మరొక బాలీవుడ్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.ఎంతో బిజీగా గడుపుతున్న సమంత గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా సోషల్ మీడియాకు సమంత దూరం అవడమే కాకుండా పలు దైవదర్శనాలు, హోమాలు చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సికింద్రాబాద్లోని ఒక వేదశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వేదశాలకు భారీగా విరాళం ప్రకటించారని వార్తలు వచ్చాయి. ఇలా సమంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ భారీగా విరాళాలు అందించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు సమంతలో ఈ మార్పు ఏంటి ఉన్నఫలంగా ఇలా విరాళాలు ఇవ్వడం వెనక కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఈ విధంగా సమంత భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడం వెనుక సరైన కారణం తెలియకపోయినా గతంలో ఈమె దైవదర్శనాలకు వెళ్లడం వల్ల మనశ్శాంతి కలగడమే కాకుండా తనేంటో తనకు అర్థమయ్యేలా చేసిందని చెప్పుకొచ్చారు. అయితే కేవలం సమంత భక్తి భావంతోనే ఇలా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుందని పలువురు భావిస్తున్నారు. మరి ఈమె విరాళాలు ఇవ్వడం వెనుక అసలైన కారణం ఏంటో తెలియాలంటే సమంత సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus